సాయిధరమ్ తేజ రోడ్ ప్రమాదానికి కారణం అదేనా?

సాయిధరమ్ తేజ రోడ్ ప్రమాదానికి కారణం అదేనా?

ఆర్.బి.ఎం హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన జూబ్లిహిల్స్ అపొలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాదంలో సాయిధరమ్‌కు కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. షోల్డర్ బోన్ విరిగినట్లు వెద్యులు చెబుతున్నారు. ఇన్‌సైడ్ బ్లీడింగ్, ఆర్గాన్ డ్యామేజ్ లేదని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. సాయిధరమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ప్రమాదం ఎలా జరిగింది
బంజారాహిల్స్ రోడ్ నంబర్-45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీకెండ్ కావడంతో ఏదో పార్టీకి వెళ్తూ ప్రమాదానికి గురయ్యారని చెబుతున్నారు. ఇటీవల నిర్మించిన కేబుల్ వంతెన నుంచి దిగిన తర్వాత ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. వేగంగా వస్తున్న సమయంలో రోడ్డుపై ఇసుక ఉండడంతో సాయిధరమ్ తేజ తన వాహనాన్ని అదుపు చేయలేకపోయారు. దీంతో రోడ్డుపై బైక్ స్కిడ్ అయింది. రోడ్డు పక్కన ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణం కోసం ప్రతి రోజు పదుల సంఖ్యలో ఇసుక, మట్టి లారీల్లో తరలిస్తున్నారని, అందువల్లే రోడ్డుపై ఇసుక, మట్టి పడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడని, రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయి పడినట్టు పోలీసులు చెబుతున్నారు. దాని వల్ల తేజ్‌ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడని తెలిపారు. ఆయన మద్యం సేవించలేదని పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.