కెసిఆర్ మాములు ముఖ్యమంత్రి కాదు..మల్లారెడ్డి తిట్టడంలో తప్పేముంది: మంత్రి కేటీఆర్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లా కాదని ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి అయ్యారని అలంటి గొప్ప మనిషిని ఎవరు పడితే వాళ్ళు నోటికి వచ్చినట్లు అంటే మా నాయకులూ చూస్తూ ఉండాలా అంటూ కేటీఆర్ ఓ మీడియా సమావేశంలో అన్నారు. కెసిఆర్ కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు కెసిఆర్ నే విమర్శిస్తారా అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కెసిఆర్ కు ఎంతో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకుడని కేటీఆర్ అన్నారు.
మల్లారెడ్డిని ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే అయన ఎంత వరకు సహనం పాటిస్తారని, అయన వయసును కూడా గౌరవించ కుండా మాట్లాడుతన్నారు.మల్లారెడ్డికి జోష్ ఎక్కువ అయన కోపంలో వారిని తిట్టిండు అందులో తప్పేముంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.