విడిపోతామని ముందే తెల్సి సమంత ఆలా చేసిందా?
ఆర్.బి.ఎం హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు విడిపోతున్నారనే వార్తులు గుప్పుమంటున్నాయి. ఈ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. నాగచైతన్య, సమంత వివాహం అయిన తర్వాత ఆమె ‘అక్కినేని’ఇంటిపేరును తన సోషల్ మీడియా అకౌంట్లలో జతచేసింది. అయితే ఇటీవల సమంత తన ట్విట్టర్ ఖాతాలో అక్కినేని పేరును తొలగించింది. సమంత ఎప్పుడైతే ఇంటి పేరును తీసేసిందో అప్పటి నుంచి ఈ జంట విడుపోతుందనే ప్రచారం జోరందుకుంది. దీనికితోడు సమంత సినిమాల నుంచి కొన్ని నెలల పాటు గ్యాప్ తీసుకుంటానని ఆమె ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది. ఈ పుకార్లపై అక్కినేని ఫ్యామిలి ఇప్పటివరకు స్పందిచకపోవడం గమనార్హం. వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని టాలీవుడ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. సమంత ప్రస్తుతం చైన్నైలో ఉంటోందని చెబుతున్నారు. త్వరలోనే వీరి విడాకులపై అధికారికంగా ప్రకటన వస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నారు. టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంత జంటను చూసి అందరూ ముచ్చటైన జంట అని కొనియాడారు. ఇంతలోనే విడాకుల వార్తలు ప్రచారం కావడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.