వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది: సమంత

వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది: సమంత

ఆర్.బి.ఎం డెస్క్: హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత ఇద్దరు కలిసి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ముందు అనుకున్నట్లే విడాకులు తీసుకున్నారు. అయితే ఈ జంట విడిపోయిన తర్వాత సమంతను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో కొందరు రెచ్చిపోతున్నారు. ఈ జంట విడిపోవడానికి సమంతనే కారణమని అనేక పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఓ జంట విడిపోవడమంటే.. ఇద్దరి వైపు నుంచి వైఫల్యాలున్నట్లే. ఆ లోపాలను సరిచేసుకోకపోడవంతో వివాదాలు ముదిరి విడిపోతుంటారు. అయితే విడాకులు తీసుకోవడానికి సమంతనే కారణమని చాలా మంది భావిస్తున్నారు. నాగ చైతన్యను ఏమీ అనకుండా అసలు దోషి సమంతే అని చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సోషల్ మీడియాతో నెటిజన్లు పెడుతున్న పోస్టులపై సమంత స్పందించారు. సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. విడాకులు చాలా బాధాకరమైన నిర్ణయమని చెప్పారు. తనను ఏకాంతంగా వదిలేయాలని ప్రాదేయపడ్డారు. తనపై సోషల్ మీడియాలో ఆరోపణలు బాధాకరమన్నారు. తనపై వ్యక్తిగతంగా జరుగుతున్న దాడి దారుణమని వాపోయారు. తనకు అఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దన్నానని, ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని, అదంతా అబద్దమని సమంత చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *