ఇంట్లో నుండి ఎవరు బయటకు రాకండి..! : తలసాని శ్రీనివాస్ యాదవ్
ఆర్.బి.ఎం డెస్క్: మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ప్రజలు అవసరమైతే మినహా బయటకు రావ్వొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం తెల్లవారుజాము నుండి వర్షం కురుస్తుండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులను శ్రీనివాస్ యాదవ్ అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలు జారీచేశారు. ప్రజలు అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్ కు పిర్యాదు చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
