బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఆ నేతలు..!

బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఆ ముఖ్య నేతలు..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని విడి ఇతర పార్టీలకు వెళ్లిన నాయకులను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రప్పించడానికి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని ఆ నిజయోజకవర్గాలలో బలం పెంచుకునే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారా? గతంలో రేవంత్ రెడ్డితో పాటు టీడీపీలో పని చేసిన నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లి ఇప్పుడు వారు అక్కడ అసంతృప్తితో ఉన్న నాయకులపై రేవంత్ రెడ్డి కన్నేశారా? అంటే అవును అని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే వ్యూహంపై కసరత్తు చేస్తున్న రేవంత్ రెడ్డి మొదటి దశలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేతలతో మంతనాలు పూర్తి చేశారని ఇతర జిల్లాల నేతలతో కూడా ప్రాధమిక చర్చలు జరిపారని అతి త్వరలోనే వారిని పార్టీలోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని అనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీని విడి బీజేపీ లోకి చేరారు.నాలుగు నియోజకవర్గాల్లో మంచి పట్టున ఈ నాయకులు ghmc ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుండి బీజేపీలోకి మారారు.బీజేపీ తీర్థం పుచ్చుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్,మాజీ మంత్రి ముకేశ్ కుమార్ కుమారుడు విక్ర గౌడ్మ్,మాజీ మేయర్ బండ కార్తీక ఆమె భర్త చెంద్ర రెడ్డి లు వీరికి బీజేపీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదని అసంతృప్తిలో ఉన్నారని సమాచారం.ఈ నేపథ్యంలో వారితో రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపారని త్వరలోనే సొంత గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published.