గుండు చేసుకున్న రష్మిక….ఇంతకీ ఏ దేవుడి మొక్కో?

గుండు చేసుకున్న రష్మిక….ఇంతకీ ఏ దేవుడి మొక్కో?

ఆర్ బి ఎం డెస్క్ హైదరాబాద్: అగ్ర తారల్లో ఒకరైన రష్మిక మందన్నా అంతర్జాలంలో గుండుతో దర్శనమిస్తున్న ఆమె చిత్రాలు అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. రష్మిక తన అందంతో తన నటనతో అభిమానుల్ని తన వైపు తిప్పుకుంది. ఉన్నట్టుండి రష్మిక గుండుతో దర్శనమిచ్చినా ఫోటోను నెట్టింట్లో చూసి అందరూ షాక్ కు గురయ్యారు.ఇంతకు రష్మిక గుండు కొట్టుకుందా లేదా దేవుడికి మొక్కు చెల్లించుకుందా అనే అనుమానంతో ఫాలోవర్స్ ఒకసారి నెట్టింట్లో సెర్చ్ చేసి చూడగా అసలు విషయం బయటపడింది.

తమిళనాడులోని పలు కటింగ్ షాపుల బోర్డులకు రష్మిక గుండుతో ఉన్న చిత్రాలను వ్యాపారులు అమర్చుకున్నారు. తమ వ్యాపారం మెరుగుపడుతుందని కొంతమంది వ్యాపారులు ఇలాంటి బోర్డులు పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. తమ అభిమాన నటిని ఈవిధంగా అవమానించినందుకు రష్మిక అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే రష్మిక గుండుతో ఉన్న బోర్డులు అన్ని తీసివేయాలని సెలూన్ యజమానులకు అభిమానులు డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో గుండుతో ఉన్న రష్మికా మందన్నా చిత్రాలను ఫన్నీ మీమ్స్‌ సృష్టిస్తూ మీమర్స్‌ అంతర్జాలంలో హల్చల్ చేస్తున్నారు. మొత్తానికి తమిళనాట రష్మికకు అవమానం జరిగిందని అభిమానులు అంటున్నారు. గతంలో నయనతార, కీర్తి సురేష్ పలు టాప్ హీరోయిన్స్ చిత్రాలకు కూడా గుండు కొట్టి ఇదేవిధంగా నెట్టింట్లో చక్కర్లు కొట్టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *