యశోద ఆసుపత్రి కి సీఎం కేసీఆర్

యశోద ఆసుపత్రి కి సీఎం కేసీఆర్

ఆర్ బి ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు రోజుల క్రితం స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ ఆయినా విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఎర్రవల్లిలో ఉన్న తన ఫాంహౌస్లో ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కాగా కెసిఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రమణ నేతృత్వంలో యశోద ఆస్పత్రి వైద్య బృందం కెసిఆర్ కు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ రోజు ఛాతికి సిటీ స్కాన్ టెస్టులు చేయించుకోవడం కోసం కెసిఆర్ నగరంలోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. కెసిఆర్ ఊపిరితిత్తులు సాధారణంగానే ఉన్నాయని వాటికీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కాలేదని టెస్ట్ అనంతరం వైద్యులు వెల్లడించారు.ఈ క్రమంలో పలు టెస్టుల నిమిత్తం రక్త నమూనాలు వైద్యులు సేకరించారు. వాటికీ సంబందించిన రిపోర్ట్స్ రేపు వస్తాయని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మరోసారి వైద్యులు వెల్లడించారు. యశోద ఆసుపత్రి నుండి టెస్టుల అనంతరం ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ కి కెసిఆర్ గారు వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published.