సెల్ఫ్ ఐసోలేషన్లోకి మహేష్ బాబు..!
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా మహమ్మారి దేశ ప్రజలని తీవ్ర భయానికి గురిచేస్తూ బాలి తీసుకుంటుంది. దేశంలో రోజుకు అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి సామాన్యుడి నుండి కుబేరుల వరకు ఎవరిని వదలడం లేదు. ఇప్పటికే కరోనా రాజాకీయ నాయకులని సైతం ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా కరోనా కలకలం రేపుతోంది. కరోనా వచ్చినా వారితో సన్నిహితంగా ఉన్న పలువురు ప్రముఖులు సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోతున్నారు.
ఇప్పటికే పవర్ స్టార్ పోవాన్ కళ్యాణ్ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం అయన వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.పవన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నటు సమాచారం. టాలీవుడ్లో మరో అగ్ర హీరో ప్రభాస్ హెయిర్ స్టైలిస్ట్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ప్రభాస్ సైతం ఐసోలేషన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్టు సమాచారం. మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కు కరోనా సోకడంతో మహేష్ బాబు కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమాట్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించినా షోట్టింగ్ ను మహేష్ బాబు వేయిదావేశారు. గత కొద్దీ రోజులుగా తమ చిత్ర యూనిట్లో పలువురికి కరోనా సోకడంతో మహేష్ బాబు సినిమా షూటింగ్ ను నిలిపివేసినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలో తమ అభిమాన హీరోలకు కరోనా సోకడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.