రేపటి నుంచి ఒంటి పూట బడులు..

రేపటి నుంచి ఒంటి పూట బడులు..

ఆర్.బి.ఎం హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం (మార్చి 15) నుంచి అన్ని పాఠశాలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా పగటిపూట ఉష్టోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ ఒంటిపూట బడి నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

విద్యాశాఖ ప్రతిపాదనను పరిశీలించిన అధికారులు ఒంటిపూట బడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మార్గదర్శకాలు విడుదల చేశారు. కరోనా వల్ల ఈ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేది నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించారు. జనవరిలో మళ్లీ కరోనా తీవ్రత పెరగడంతో సంక్రాతి సెలవులను 24 రోజులు పొడగించారు. ఈ ఏడాది 70 శాతం మాత్రమే సిలబస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలు మే 11వ తేదీన ప్రారంభమై.. మే 20వ తేదీన ముగుస్తాయి. వేసవి సెలవులు పూర్తైన తర్వాత జూన్ రెండో వారంలో పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తారు.

Leave a Reply

Your email address will not be published.