కరోనా సమయంలో ఆశా వర్కర్ల పాత్ర కీలకం : హేమ సామల,కార్పొరేటర్

కరోనా సమయంలో ఆశా వర్కర్ల పాత్ర కీలకం : హేమ సామల,కార్పొరేటర్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నగరంలో సీతాఫల్ మండి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు కార్పొరేటర్ హేమ సామల గారి అధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హేమ సామల అధ్వర్యంలో నిర్వహించిన నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ గారు హాజరై ఆశా వర్కర్లుకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ సామల గారిని పద్మారావు అభినందించారు . తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆశా వర్కర్లు అని ఆయన కొనియాడారు. అనంతరం హేమ సామల మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని ఆమె అన్నారు. కరోనా విజృంభిస్తున్న ఆశా వర్కర్లు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని వారికి ఎంత చేసిన తక్కువే అవుతుందని హేమ సామల అన్నారు. ఈ నేపథ్యంలో వారికి వారి కుటుంబాలకు అండగా ఉంటామని హేమ సామల హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు దుర్గ ప్రసాద్, గౌతమ్, సాయి,మహేష్,మహిళా నాయకులు పద్మ,అర్చన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.