అసెంబ్లీలో తలపడ్డ తలసాని, రాజగోపాల్‌రెడ్డి

అసెంబ్లీలో తలపడ్డ తలసాని, రాజగోపాల్‌రెడ్డి

ఆర్.బి.ఎం హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తలపడ్డారు. ఒకరిపై ఒకరి తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. అసెంబ్లీలో సోమవారం తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై చర్చ ప్రారంభించారు. ఈ చర్చలో తలసాని, రాజగోపాల్‌రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. రాజగోపాల్‌రెడ్డిని తలసాని కాంట్రాక్టర్‌తో పోల్చారు.

తలసాని వ్యాఖ్యలపై రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంట్రాక్టర్‌ అయితే.. పేకాట ఆడినోళ్లు మంత్రులు కావొచ్చంటూ రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవాచేశారు. సింగరేణిపై లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్, సింగరేణిలో అవినీతి జరగలేదని నిరూపిస్తే.. మంత్రుల కాళ్లు కడిగి నెత్తిపై పోసుకుంటానని రాజగోపాల్‌రెడ్డి సవాల్ విసిరారు.

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి కుసంస్కారంగా మాట్లాడుతున్నారని కేటీఆర్‌ దుయ్యబట్టారు. మంత్రిపై రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదని, తక్షణమే రాజగోపాల్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.