సమాజానికి నేటికీ దశాదిశ చూపేది స్వామి వివేకానంద బోధనలే: స్వామి బోధమయానంద

సమాజానికి నేటికీ దశాదిశ చూపేది స్వామి వివేకానంద బోధనలే: స్వామి బోధమయానంద

హైదరాబాద్: సమాజానికి నేటికీ దశాదిశ చూపేది స్వామి వివేకానంద బోధనలేనని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. పెద్ద కంపెనీల సీఈఓలు, సెలబ్రిటీలు వ్యక్తిత్వం కోల్పోతూ జైళ్లపాలవుతున్నారని చెప్పారు. స్వామి వివేకానంద బోధనలు అనుసరించడం ద్వారా సరైన సమయంలో సరైన మార్గనిర్దేశం లభిస్తుందన్నారు. 162వ జయంతి వేడుకల్లో భాగంగా ఆర్కే మఠ్‌ వివేకానంద ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 1893లో ముంబై నుంచి అమెరికాకు వెళ్లే నౌకలో స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తితో జంషెడ్‌జీ టాటా ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రారంభించిన సందర్భాన్ని స్వామి బోధమయానంద గుర్తు చేశారు. రెండు రోజుల పాటు జరిగే జాతీయ యువజన దినోత్సవాల్లో భాగంగా తొలిరోజు కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి, గుంటూరు టొబాకో బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు, డెక్స్‌టెరిటీ గ్లోబల్ సిఈఓ శరద్ వివేక్ సాగర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నేడు రామకృష్ణ మఠంలో వివేకానంద సాహిత్యంపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని స్వామి బోధమయానంద తెలిపారు.

ట్యాంక్‌బండ్ విగ్రహంపై ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి ఈ ఉదయం 8 గంటలకు ఐపీఎస్ సౌమ్యా మిశ్రా పూలమాల వేస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి మఠం వరకూ అవేకనింగ్ ఇండియా వాక్ ఉంటుంది. తర్వాత వివేకానంద ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్త టీజీకే మూర్తి, విద్యావేత్త అనిల్ భరద్వాజ్ పాల్గొంటారని స్వామ బోధమయానంద తెలిపారు. వివేకానంద జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని స్వామి బోధమయానంద యువతకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published.