విద్యార్థులతో తాళపల్లి సర్పంచ్ జన్మదిన వేడుకలు..

విద్యార్థులతో తాళపల్లి సర్పంచ్ జన్మదిన వేడుకలు..

ఆర్.బి.ఎం: తాళపల్లి సర్పంచ్ అంకని ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఫసల్వాది ZPHS ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులకు ఎక్సమ్ ప్యాడ్లు, పరీక్షలకు మెటీరియల్ అందజేశారు.

ఈ సందర్భంగా తాళపల్లి సర్పంచ్ అంకని ప్రవీణ్ కుమార్ ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు విద్యార్థులతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో స్కూల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ (కన్నాయాదవ్), రాకేష్, నాయబ్, ప్రశాంత్, మనోజ్, మనీష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.