ఉప ముఖ్యమంత్రిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య..?

ఉప ముఖ్యమంత్రిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య..?

ఆర్ బి ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో దళిత వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం.రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు మంత్రివర్గంలో చోటు దక్కుతోంది అనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నియోజకవర్గంలో రెండు సార్లు విజయం సాధించి ఎమ్మెల్యేగా కాలే యాదయ్య కొనసాగుతున్నారు.కాలే యాదయ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు.అయితే కెసిఆర్ గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published.