కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలం.. : బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలం.. : బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనాను నియంత్రించడంలో తీవ్రంగా విఫలం అయ్యారని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి. జనార్దన్ రెడ్డి అన్నారు . తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదౌతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అత్యాలపంగా ఎందుకు చూపిస్తున్నాయని ఆయన అన్నారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్టులకూ కోవిద్ పరీక్షలు చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేశారని స్పష్టంగా అందరికి కనిపిస్తోందని జనార్దన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చుతామని చేసిన ప్రకటన ఇప్పుడేమైందిని అయన అన్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో కనీసం ఇప్పుడైనా రాష్ట్ర ప్రజలందరికీ చికిత్స అందుబాటులో ఉండేలా ఆరోగ్యశ్రీలో చేర్చాలని జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ ఎక్కువగా లేకపోవడంతో బాధితులు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేరుతూ లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజలు కరోనా బారిన పడి చికిత్స అందక ఇబ్బందులకు గురైతే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి. జనార్దన్ రెడ్డి ప్రభుత్వాని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published.