శంషాబాద్.. వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

శంషాబాద్‌: వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నానజీపూర్‌ గ్రామానికి చెందిన చాకలి నాగరాజు(45), మైలారం రాజు(35) ఇద్దరు మధ్యాహ్నం ఈత కోసం ఎంటేరు వాగుకు వెళ్లారు. వాగులో నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లడంతో తిరిగి ఒడ్డుకు చేరలేక ఇద్దరూ నీటిలో ముగిని మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులకు ఇద్దరికీ భార్యాపిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇదే వాగులో పడి ఇద్దరు మృతిచెందారు. మృతులిద్దరి ఒకే గ్రామంలో కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.