జగన్‌ వచ్చాడంటే కష్టాలే.. ఇదేం కర్మరా బాబూ..?

ఈ మాటలు ఏపీ ప్రజలు అంటున్నారు. సీఎం పర్యటిస్తున్న ప్రాంతాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటున్నారు. ఆయనొచ్చారంటే ఊరంతా బంద్‌ చేస్తున్నారని, జనం ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు వీలుండదని స్ధానికులు వాపోతున్నారు. రోడ్లపై అడ్డంగా బారికేడ్లు పెడుతున్నారు. ఇళ్లు, దుకాణాల ముందు డేరాలు వేస్తున్నారు. చివరికి ఆలయాలూ మూసివేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను గడపగడపకూ వెళ్లాలని జగన్ ఆదేశిస్తున్నారు. ఆయన గడప దాటారంటే మాత్రం జనం గడప బయటికి వచ్చే పరిస్థితి ఉండదని విమర్శిస్తున్నారు. జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులకు జగన్ వెళ్లినా ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. సీఎం పర్యటనకు రెండు రోజుల ముందు నుంచే పోలీసు ఆంక్షలు విధిస్తున్నారు. నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు, సూపర్‌ బజార్లు కూడా మూసివేయిస్తున్నారు. సీఎం తమ జిల్లా పర్యటనకు వస్తున్నారంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది.

చంద్రబాబుకు బుద్ధి లేదు.. బాలయ్యకు సిగ్గు లేదు.. లోకేష్‌కు బుర్రే లేదు
తిరుమల బ్రహోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు జగన్ తిరుమలకు వచ్చారు. ముందుగా ఆయన తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో ఆయన 20 నిమిషాలు మాత్రమే గడిపారు. కానీ దీనికోసం ఉదయం నుంచే ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులూ నిరాశగా వెనుదిరిగారు. గుడి పరిసరాల్లో దుకాణాలన్నీ ఉదయం నుంచే బంద్ చేయించారు. శరన్నవరాత్రులకు వ్యాపారం జోరుగా ఉండే ఈ సమయంలో రోజంతా మూసివేయడంతో దుకాణదారులు నష్టపోయారు. ఆ మధ్య జగన్ ఒక సందర్భంలో విశాఖ వెళ్లినప్పుడు దాదాపు గంటన్నరపాటు జనానికి చుక్కలు చూపించారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఫ్లైట్‌ మిస్‌ అవుతుందనే భయంతో లగేజీ తీసుకుని కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు అప్పట్లు వైరల్ అయ్యాయి. ఈ ఘటనలను చూసిన జనం జగన్ సార్ మా జిల్లాలకు రండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టోదని వేడుకుంటన్నారు.

వివాహం కోసం ఎన్నికలు..గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దేశం

Leave a Reply

Your email address will not be published.