చంద్రబాబుకు బుద్ధి లేదు.. బాలయ్యకు సిగ్గు లేదు.. లోకేష్‌కు బుర్రే లేదు

అమరావతి: ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. దీంతో రాష్ట్ర రాజకీయాలలో హాట్ హాట్ గా ఉంది.  జగన్ సర్కార్ తీరుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి అనిల్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ఘాటైన విమర్శలు చేశారు. వీటిపై స్పందించిన వైసీపీ మంత్రి అంబటి రాంబాబు.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ పై ఘాటుగా ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు బుద్ధి లేదు.. బాలయ్యకు సిగ్గు లేదు.. లోకేష్‌కు బుర్రే లేదు అంటూ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చారు. తండ్రిపై ప్రేమ చూపని బాలయ్యా! నీకు సిగ్గులేదయ్యా! అంటూ నిన్న అంబటి మరో ట్వీట్ చేశారు. జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య.. అంటూ చేసిన ట్వీట్‌పై దుమారం రేగింది. మంత్రికి టీడీపీ నేతలు, నందమూరి అభిమానులు కౌంటర్ ఇచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్విట్టర్‌ పోస్టుకు.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత పదునుగా సమాధానమిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.