‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా.. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన

‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా.. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన

ఆర్.బి.ఎం డెస్క్: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్ఠీ ప్రకటించింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున, తమ ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత, కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ‘ఫీజు పోరు’ను మార్చి 12కు వాయిదా వేస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published.