నా కొడుకును ఉరికించి చంపారు… సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం నిందితుడు రాజు తల్లి వీరమ్మ
ఆర్.బి.ఎం హైదరాబాద్: తన కొడుకును ఉరికించి చంపారని సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం నిందితుడు రాజు తల్లి వీరమ్మ వాపోయారు. మూడు రోజుల కిందటే రైల్వేస్టేషన్‌లో తన కొడకుని పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేయాలని పోలీసులు మాట్లాడుకుంటే విన్నానని చెప్పారు. తమను మూడు రోజుల కిందటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. మూడు రోజుల నుంచి స్టేషన్‌లో ఉన్నా ఎవరూ రాలేదని, నిన్న ఒక్కసారి అందరూ వచ్చారని తెలిపారు. పోలీసులు పెద్ద సంఖ్యలో రావడంతో తమకు అప్పుడే అనుమానం వచ్చిందని వీరమ్మ పేర్కొన్నారు. నిన్న రాత్రి తమను ఉప్పల్‌లో వదిలి పెట్టారని, తమను అటు పంపించి ఈ రోజు ఉదయం రాజును చంపేశారని వీరమ్మ ఆరోపించారు.