న్యూఢిల్లీ: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో మొబైల్స్ అమ్మకాలు భారీగా జరిగినట్లు అధికారులు ప్రకటించారు. గత నెల 22 నుంచి 30 తేదీల మధ్యలో ఇంచుమించుగా అన్ని ఆన్‌లైన్ సైట్లు ఫెస్టివ్ సేల్ వీక్ 1 నిర్వహించాయి. ఈ సీజన్ అమ్మకాల్లో మొబైల్ ఫోన్లు ప్రత్యే క ఆకర్షణగా నిలిచాయి. మొబైల్ ఫోన్ల విభాగం మొత్తం వాణిజ్య విలువలో (జీఎంవీ) 41 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. అంటే గంటకు 56,000 ఫోన్లు అమ్ముడుపోయాయి. ఫ్యాషన్ విభాగం 20 శాతం జీఎంవీ సాధించింది. గత పండుగల సీజన్‌తో పోల్చితే 48 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముగిసిన 7 రోజుల పండుగల తొలి సీజన్ అమ్మకాల్లో 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రూ.40 వేల కోట్ల అమ్మకాలు సాధించాయి. రెడ్‌సీర్స్ స్ర్టాటజీ కన్సల్టింగ్ లిమిటెడ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం మింత్రా, షాప్సీ సహా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఆర్డర్ల విలువలో అగ్రస్థానంలో ఉండగా మీషో రెండో స్థానంలో ఉంది.
గంట గంటకు..56వేల మొబైల్స్ అమ్మకాలు..
