ఒక్క కిలో ఉప్పు 30 వేల రూపాయలు

ఒక్క కిలో ఉప్పు 30 వేల రూపాయలు

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సాధారణంగా మనం నిత్యం ఉపయోగించే ఉప్పు ధర బ్రాండ్ ను బట్టి 20 నుంచి 30 రూపాయల వరకు ఉంటుంది. కానీ అదే కొరియన్ బాంబూ ఉప్పు ధర 20 వేల నుంచి 30 వేల వరకు ఉంటుంది. ముందు ఈ ఉప్పుని కొరియాలో తయారు చేసేవారు. సముద్రపు ఉప్పుని వెదురు బొంగులో నింపి 400 డిగ్రీల వద్ద కాలుస్తారు. ఈ విధంగా సుమారు 9సార్లు చేస్తే ఇది స్పటిక ఆకారంలోకి మారుతుంది. ఒక్క కిలో తయారీకి 20 రోజులు పడుతుంది. ఈ విధంగా తయారుచేసిన ఉప్పులో 73 మినరల్స్ ఉంటాయి. ఈ ఉప్పుని వాడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని  నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరాఖండ్ సర్కార్ ఈ ఉప్పుని తయారు చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published.