ఇన్‌కం ట్యాక్స్‌పై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఆర్.బి.ఎం డెస్క్: ఆదాయపు పన్నుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఇక రూ.12 లక్షల నుండి రూ.16 లక్షల వరకు 15 శాతం పన్ను విధించనున్నారు. రూ.16లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి 20శాతం పన్ను ఉండనుందని తెలిపారు. రూ.20 లక్షల నుండి రూ.24 లక్షల వరకు 25% పన్ను ఉంటుంది. ఇక ఏ శ్రేణి వారికైనా రూ.4 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.