శ్రీవారికి సమర్పిస్తున్న తలనీలాలకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..!

తిరుమల: శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు. భక్తులకు ఈయన కొంగుబంగారం. అందుకే తిరుమలతో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు శ్రీవారి సందర్శిస్తూ ఉంటారు. కోరికలు నెరవేరిన భక్తులు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు శ్రీవారి తలనీలాలు ఇస్తూ ఉంటారు. అయితే పెద్ద మొత్తంగా వస్తున్న వెంట్రుకలను టీటీడీ ఏం చేస్తుందనే అనుమానం అందరిలో ఉంటుంది. భక్తులు సమర్పించిన తలనీలాలను పొడవును బట్టి మూడు కేటగిరీలుగా విభజిస్తారు. గ్రేడ్ 1 లో 31 ఇంచుల కంటే ఎక్కువ పొడుగు ఉంటే గ్రేడ్ 1 కింద లెక్కిస్తారు. 1600 కేజీల గ్రేడ్ వన్ తల వెంట్రుకలను వేలం వేస్తే 3.56 కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం. గ్రేడ్ 2 తల వెంట్రుకలు 16-30 ఇంచుల మధ్య ఉంటాయట. 2000 కేజీల గ్రేడ్ 2 తల వెంట్రుకలకు దాదాపు 3.44 కోట్ల రూపాయలు వచ్చాయట. మొత్తంగా చూస్తే 2018 లెక్కల ప్రకారం చూసుకుంటే 5600 కేజీల తల వెంట్రుకలపై టీటీడీకి ఏడు కోట్ల మేరకు ఆదాయం వచ్చిందని చెబుతున్నారు. అలాగే గ్రేడ్ 3 పది నుంచి పదిహేను ఇంచుల పొడవు ఉండే వెంట్రుకలను గ్రేడ్ 3గా పరిగణిస్తారు. 3000 కిలోల గ్రేడ్ 3 వెంట్రుకలపై 24.11 లక్షల రూపాయలు వచ్చాయని అంటున్నారు. దీంతో పాటుగా తెల్ల వెంట్రుకలకు కూడా వేలంలో మంచి రేటు పలుకుతుందట. 1200 కేజీల తెల్ల వెంట్రుకలపై 66.55లక్షల రూపాయలు వచినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.