ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా, చాలా మంది ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కాగా, సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. కాసేపటి క్రితం ఆయన కృష్ణ నివాసానికి వచ్చి కృష్ణ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం మహేశ్ బాబును సీఎం కేసీఆర్ హత్తుకుని ఓదార్చారు. మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ తదితర నేతలు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. ఇప్పటీకే కేసీఆర్..కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మహేష్‌బాబు హత్తుకుని ఓదార్చిన కేసీఆర్
