పోలీస్ కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాల కోసం ఈవెంట్స్ లో ట్రైనింగ్ పొందుతున్న యువతి యువకులతో స్థానిక ఎమ్మెల్యే కోరికటి చందర్..
రామగుండం : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కోరికటి చందర్ వాక్ ముగించుకొని ౩౦నిమిషాల పాటు అక్కడే గ్రౌండ్ లో కూర్చొని ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. అదే గ్రౌండ్ లో పోలీస్ కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాల కోసం ఈవెంట్స్ లో ట్రైనింగ్ పొందుతున్న యువతి యువకులతో ఎమ్మెల్యే సరదాగా మాట్లాడారు. ముందుగా మీ అందరికి న సెల్యూట్ చేసి వారికీ సలహాలు సూచనలు అందించి ఈ వచ్చిన అవకాశాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకోమని ,మంచి ఆహారాన్ని ,నిద్రను ఉన్నపుడే వీటికి మీ కష్టం తోడైనపుడు మీ గమ్యాన్ని చేరుకుంటారని సూచించారు అంతే కాకుండా ఏ యొక్క సెలక్షన్ ఐపోయేంతవరకు మీకు ఎపుడైనా ఎక్కడైనా గ్రౌండ్ లో కానీ , ట్రైనింగ్ లో కానీ ఎలాటి అవసరమున్న మీకు ఎని టైం నీకు కానీ సింగరేణి సంస్థ కానీ పోలీస్ సంస్థ కానీ మీకోసం ఏ అవసరం వచ్చిన చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇపుడు మీకు సింగరేణి సంస్థవారు పాలు ,అరటిపండ్లు ,ఎగ్స్ అందిస్తుందని ఐనప్పటికీ ఇంకా మీరు ఏ విషయం లోను సతమతం ఐతే పర్సనల్ గా మీ సమస్యను ఒక చీటీ లో రాసి ఇవ్వండి అని సూచించారు