వైఎస్ షర్మిల అరెస్ట్.. స్పృహ తప్పి పడిపోయిన షర్మిల

వైఎస్ షర్మిల అరెస్ట్.. స్పృహ తప్పి పడిపోయిన షర్మిల

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల కోసం దీక్ష చేప్పట్టిన వైఎస్ షర్మిల. పోలీసులు దీక్షకు సాయంత్రం 5 గంటలవరకు సమయం ఇవ్వడంతో షర్మిల దీక్ష ముగించుకొని లోటస్ పౌండ్ కు కాలినడకన అభిమానులతో ర్యాలీగా బయల్దేరింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్న షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను నెట్టుకుంటూ షర్మిల ముందుకు వేళ్ళ సాగింది. ఈ క్రమంలో పోలీసులు ఎంత చెప్పిన షర్మిల వినకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో షర్మిల స్పృహ తప్పి పడిపోయారు.పోలీసులు షర్మిలను వాహనంలోకి ఎక్కించగా పోలీసులకు అభిమానవులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీగా అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డు తొలగించి షర్మిలను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published.