షర్మిలకు గాయం.. మరోసారి ఇలా చేస్తే ఊరుకోను..

షర్మిలకు గాయం.. మరోసారి ఇలా చేస్తే ఊరుకోను..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగుల కోసం వైఎస్ షర్మిల దీక్ష చేశారు అయితే పోలీసులు దీక్షకు ఇచ్చిన సమయం అయిపోవడంతో షర్మిల దీక్ష శిబిరం నుండి లోటస్ పౌండ్ కు కాలినడకన బయల్దేరారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్న షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతులు లెవ్ అని పోలీసులు షర్మిలతో వాదించారు. నేను శాంతియుతంగా పాదయాత్ర గా లోటస్ పౌండ్ కి వెళ్తానని చెప్పగా పోలీసులు నిరాకరించారు. పోలీసులను నెట్టుకుంటూ షర్మిల ముందుకు వెళ్లారు. పాదయాత్రకు అనుమతులు లేకపోవడంతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో షర్మిల స్పృహ తప్పి పడిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులకు షర్మిల అభిమానులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

షర్మిలను అరెస్ట్ చేసి బేగంపేట్ పోలీస్ స్టేషన్స్ కు తరలించారు. అక్కడి నుండి ప్రతేక్య కారులో షర్మిలను పోలీసులు లోటస్ పౌండ్ కు తీసుకువెళ్లారు. లోటస్ పౌండ్ కి చేరుకున్న షర్మిల మీడియాతో మాట్లాడుతూ పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని తనను అరెస్ట్ చేసే క్రమంలో తన చేయికి గాయం అయిందని ఆమె పేర్కొన్నారు. పోలీసులు కెసిఆర్ కు పని చేస్తున్నారా లేక ప్రజలకు సేవ చేస్తున్నారా అర్ధం కావడం లేదని ఆమె అన్నారు. తన చేయికి గాయం అయినా కూడా పచ్చి మంచి నీళ్లు కూడా తాగానని ఆమె అన్నారు. ఇప్పటికే ప్రతేక్య వైద్య బృందం లోటస్ పౌండ్ కు చేరుకున్నారు. పోలీసులు తనని గాయపరిచారని మరోసారి తన పై చేయి వేస్తే ఊరుకోను అని షర్మిల హెచ్చరించారు.

లోటస్ పౌండ్ కి భారీ సంఖ్యలో యువత చేరుకుంటున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకుంటున్నారు. షర్మిల ప్రస్తుతం లోటస్ పౌండ్ లో నిరుద్యోగుల దీక్ష కొనసాగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published.