సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలి: ఎంపీ విజయసాయి
ఆర్.బి.ఎం హైదరాబాద్: మెగా హీరో సాయిధరమ్‌తేజ్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కోరుకుంటున్నారు. సాయిధరమ్‌తేజ్ త్వరగా కోలుకోవాలని ఎంపీ విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై విజయసాయి ట్విట్టర్‌లో స్పందించారు. ‘ప్రమాదానికి గురైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. సాయి తేజ్ హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్‌పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని విజయసాయి ట్వీట్ చేశారు. జూబ్లిహిల్స్ అపోలో చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్‌ను పలువురు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.