రోడ్డు ప్రమాదాల్లో తమ పిల్లలను కోల్పోయిన ప్రముఖులు వీరే..
ఆర్.బి.ఎం హైదరాబాద్: ధనవంతుల పిల్లలు విలాసాలకు అలవాటు పడి ప్రాణాలను పొగుట్టుకుంటున్నారు. పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు చివరకు తీరని దు:ఖాన్ని మిగిల్చిపోతున్నారు. సెలబ్రెటీల పిల్లలకు ఖరీదైన స్పోర్ట్స్ బైకులతో రేసింగ్‌లో పాల్గొంటూ ప్రాణాలను బలిగొంటున్నారు. అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు. హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో సినీ పెద్దలు మరోసారి ఆందోళన చెందుతున్నారు. గతంలో నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్, మరో నటుడు బాబు మోహన్ కుమారుడు పవన్, మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ బైక్ ప్రమాదంలో మరణించారు. నాటి ప్రమాదాల నుంచి ఇంకా ఆ కుటుంబాలు కోలుకోలేదు. తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా వాళ్లలో మార్పు రావాలని అందరూ కోరుకుంటున్నారు.