మోదీపై రేవంత్‌రెడ్డి ఫైర్..
ఆర్.బి.ఎం హైదరాబాద్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు మోదీ అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలన్నీ కేంద్రం చేసిన హత్యలేనని దుయ్యబట్టారు. చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలను బీజేపీ పక్కన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్ డ్రామాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించాల్సిన సమయంలో హోర్డింగ్‌ల పంచాయితీ పెట్టారని రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు.