క్రీడాకారులను అభినందిచిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్..

క్రీడాకారులను అభినందిచిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్..

ఆర్.బి.ఎం హైదరాబాద్,సికింద్రబాద్: యువత విద్యతో పాటు క్రీడారంగంలో కూడా రాణించాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలో విజయం సాధించి జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికైన జింఖానా స్టేడియం క్రీడాకారులు నగరంలోని ఉప సభాపతి పద్మారావు గౌడ్ ను అయన  నివాసంలో కలిశారు. విజయానికి కృషి చేసిన బాక్సింగ్ కోచ్ మనోజ్ రెడ్డిని, బాక్సింగ్ లో తమ సత్తా చాటుకున్న క్రీడాకారులను పద్మారావు గౌడ్   అభినందించారు. అనంతరం పద్మారావు గౌడ్ మాట్లాడుతూ చిన్నారులు చదువుతూ పాటు తమకు నచ్చిన క్రీడను ఎంచుకుని రాణించాలని సూచించారు. జాతీయ స్థాయిలో గెలిచి తెలంగాణ పేరు నిలబెట్టాలని పద్మారావు గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహాకాలు అందజేస్తుందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. చెన్నైలోని ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీలో జరగబోయే జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎస్.వార్షిత, కె.అశ్విన్, పి.తరుణ్ లు ఎంపికైయ్యారు.

Leave a Reply

Your email address will not be published.