అసుదుద్దీన్ ఇంటిపై దాడి… ఉద్రికత్త
ఆర్.బి.ఎం ఢిల్లీ: ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఢిల్లీలో అసదుద్దీన్ అధికార నివాసంపై ఈ రోజు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడికి తెగబడ్డవారిని హిందూసేనకు చెందిన కార్యకర్తులు అని అనుమానిస్తున్నారు. అసదుద్దీన్ ఇంటి తలుపు, నేమ్ ప్లేట్, ఇంటి బయటికి ఉన్న అద్దాలను పగలగొట్టారు. ధ్వంసం చేసిన గాజు ముక్కలను ఇంటి ఆవరణలో చల్లారు. ఈ దాడి జరిగిన సమయంలో అసదుద్దీన్ ఇంట్లో లేరు. మొత్తం ఎనిమిది మంది దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. వీరిలో ఐదుగురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అసదుద్దీన్‌కు వ్యతిరేకంగా దుండగులు నినాదాలు చేశారు. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు తమ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారని హిందూ సేన అధినేత విష్ణు గుప్త ప్రకటించారు. అసదుద్దీన్ ఇంటిపై జరగిన దాడిని ఎంఐఎం తీవ్రంగా ఖండించింది.