టీఆర్‌ఎస్ నేత కండకావరం… గ్రామ సమస్యలు తీర్చమని అడినందుకు ఎగిరెగిరి తన్నిన సర్పంచ్
వికారాబాద్: టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు కండకావరంతో రెచ్చి పోతున్నారు. అధికారం బలంతో ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించమని అడిగితే చివాలెత్తి పోతున్నారు. వికారాబాద్ జిల్లా మరిపల్లి మండల పరిధిలోని దామస్తాపూర్ చెందిన శ్రీనివాస్‌ను సర్పంచ్ జైపాల్‌రెడ్డి కాలితో ఎగిరెగిరి తన్నారు. గ్రామంలో తాగునీటి, పారిశుధ్య సమస్యలను తీర్చాలని శ్రీనివాస్, సర్పంచ్ జైపాల్‌రెడ్డిని కోరారు. ఇంకేముందు ‘నన్నే నిలదీస్తావా’అంటూ సర్పంచ్ శ్రీనివాస్‌పై దాడి చేశారు. ఇష్టమెచ్చినట్లు శ్రీనివాస్‌ను కాలితో తన్నారు. దాడి చేసిన జైపాల్‌రెడ్డిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కండకావరంతో టీఆర్‌ఎస్ నేతలు కన్నుమిన్ను కానరాక ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. జైపాల్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.