బీజేపీలో కష్టంగా ఈటల!.. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌లోకి?

బీజేపీలో కష్టంగా ఈటల!.. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌లోకి?

ఆర్.బి.ఎం హైదరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆ పార్టీలో మనస్పూర్తిగా ఉండడం లేదనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన బీజేపీ రాజకీయాల్లో ఇమడలేక పోతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఈటల బీజేపీలో ఉండడం కష్టమేనని ఆయనన దగ్గరగా గమనిస్తున్న వారు చెబుతున్న మాట. సహజంగా బీజేపీ నేతలు తమ ప్రసంగాలను జై శ్రీరాం అని ప్రారంభి.. భారతమాతకు జై అని ముగిస్తారు. ఈటల బీజేపీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు తన నోటి నుంచి ఈ రెండు నినాదాలు వినిపించడం లేదని చెబుతున్నారు. మీకు ఓ ఉదాహరణను చెబుతాను.

ఈ నెల 17న బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్‌లో సభ నిర్వహించారు. ఈ సభలో ఈటలను ప్రసంగించమని సభాద్యక్షులు కోరారు. ఈటల ప్రసంగించడానికి సిద్ధమవుతున్న సమయంలో అదే వేదికపై ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేచారు. ఈటల దగ్గరకు వెళ్లి ఏదో చెవిలో చెప్పారంట. వెంటనే మైక్ అందుకున్న ఈటల.. భార‌త‌మాతాకీ జై అంటూ తన ప్రసంగాన్ని మొద‌లుపెట్టి.. భార‌త‌మాతాకీ జై అంటూనే ముగించారు. అయితే కిష‌న్ రెడ్డి చెప్పడంతో అతికష్టం మీద ఈటల భాతరమాతకు జై అని నినాదం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక‌ ప్రచారంలో వ్యక్తిగ‌తంగానే ఈటల ఓట్లు అడుగుతున్నార‌నే చ‌ర్చ కొంత కాలంగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆయన బీజేపీ చేరడంపై అనే పూకార్లు ప్రచారంలోకి వచ్చాయి. కేసుల నుంచి ఉపశమనం పొందేందుకే బీజేపీ చేరారని అందరీ నుంచి వస్తున్న సమాదానం. ఈటల రాజీనామా తర్వాత ఆయనను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి మొదలు కొని.. అందరూ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. చివరకు ఈటల బీజేపీలో చేరారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే.. ఆయన బీజేపీలో కొనసాగుతారని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.