అబార్షన్‎పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

న్యూఢిల్లీ: అబార్షన్ పై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్ లు చేయించుకోవచ్చని వెల్లడించింది. భర్త బలవంతం చేసినా అత్యాచారం కిందకు వస్తుందని తెలిపింది. వైవాహిక అత్యాచారంగా దానిని పేర్కొనాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. పెళ్లి కాలేదన్న పేరుతో అబార్షన్ ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం అవివాహిత మహిళలు కూడా అబార్షన్ చేయించుకోవచ్చని తెలిపింది. అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కు మహిళలకు ఉందని పేర్కొంది. గర్భం దాల్చిన 24 వారాల వరకూ అబార్షన్ చేయించుకోవచ్చని తెలిపింది. మెడికల్ టర్మినేషన్ కేసులో తీర్పును ప్రకటించే సమయంలో అబార్షన్ చేయించుకునే హక్కు అందరికీ ఉందని తెలిపింది. అబార్షన్ కు వివాహిత, అవావిహిత అంటూ ఏమీ ఉండదని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.