‘XXX’నిర్మాతకు అరెస్ట్ వారెంట్…!

వెబ్ సిరీస్ ‘XXX’నిర్మాత అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. నిర్మాత ఏక్తాకపూర్ సినిమాలతో పాటు సీరియళ్లు, వెబ్ సిరీస్‎లతో బిజీగా ఉంది. స్ట్రీమ్ కోసం ఆమె ‘ఆర్ట్ బాలాజీ’ అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా ఏర్పాటు చేసుకుంది. అయితే..తాజాగా ఆమె ‘ఎక్స్ఎక్స్ఎక్స్’ వెబ్ సిరీస్ లోని రెండు సీన్లు భారీ వ్యూస్ ను సాధించాయి. దాంట్లో సైనిక కుటుంబాలను అభ్యంతరకంగా చూపించారని విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్ లోని బేగుసరైలో ఈ సిరీస్ నిర్మాతలైన ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభ కపూర్ లపై కేసు నమోదయింది. 2020లో శంభు కుమార్ అనే మాజీ సైనికుడు వీరిపై కేసు వేశారు. కేసు విచారించిన కోర్టు ఏక్తా, శోభలపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published.