ఆటో ఎక్కనందుకు మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఆటో డ్రైవర్..

ఆటో ఎక్కనందుకు మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఆటో డ్రైవర్..

ఆర్.బి.ఎం డెస్క్: మనం సాధారణంగా సమాజంలో జరిగే అన్ని వింతలను చూస్తూనే ఉంటాం.అమ్మాయి ప్రేమించలేదని ఆమెను అతి కిరాతకంగా చంపడం అత్యాచారాలు చేయడం ఇలా రోజు మనం ఎక్కడో ఒకచోట జరిగిందని వింటూనే ఉంటాం. అందరు ఆశ్చర్యపోయే ఒక దారుణ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నాసిక్ ప్రాంతానికి చెందిన భారతి అనే మహిళా పొట్టకూటికోసం చీరల వ్యాపారం మొదలుపెటింది. అయితే రోజు తన షాప్ కి వెళ్ళడానికి భారతి ఆటోలో ప్రయాణం చేసేది. ఆమె తన చీరల షాప్ కి రోజు అనుకోకుండా తరుచు మొదటి రోజు ప్రయాణించిన ఆటోలోనే వెళ్ళేది. ఆలా భారతి కొన్నాలు అదే ఆటోలో తన షాప్ కి వెళ్ళేది.ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఆమెతో కొంత సన్నిహితంగా మెలిగేవాడు.

గత మంగళవారం భారతి రోజు ఎక్కే ఆటో కాకుండా వేరే ఆటోలో తన షాప్ కి వెళ్ళింది. తన ఆటో ఎక్కకపోవడం గమనించిన ఆటో డ్రైవర్ ఎంతో కోపంతో ఊగిపోయాడు. ఆ ఆటో డ్రైవర్ తదుపరి రోజు స్వయంగా భారతి ఇంటి వద్దకు వెళ్లి తన ఆటో లో ఎందుకు ప్రయాణించడం లేదని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారి మధ్య కొంత వాగ్వాదం నెలకొంది.ఆటో డ్రైవర్ వేధింపులు శృతి మించడంతో భారతి ఆటో డ్రైవర్ చెంప చెళ్ళుమనిపించింది వాగ్వాదం జరిగిన తర్వాత రోజు కూడా ఆటో డ్రైవర్ తన ఆటోలు ప్రయాణించాలి అని భారతిని డిమాండ్ చేశాడు. దానికి ఆమె ఒప్పుకోకుండా వేరే ఆటోలో వెళ్ళిపోయింది.

భారతిని వెంబడించి ఆమె సోదరి సుశీల నివాసానికి ఆటో డ్రైవర్ చేరుకున్నాడు. భారతి బయటికి రావాలి అంటూ ఇంటి ఆవరణలో ఆటో డ్రైవర్ అసభ్యకర పదజాలంతో భూతుల వర్షం కురిపించాడు. భారతి సోదరి సుశీల తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆటో డ్రైవర్ బలవంతగా ఇంట్లోకి ప్రవేశించి తన వెంబడి తీసుకొచ్చిన కిరోసిన్ భారతి ఒంటిపై చల్లి అగ్గిపుల్లతో ఆమెకు నిప్పంటించాడు. కొద్దీ క్షణాల్లోనే భారతి అగ్నికి ఆహుతి అయింది. సుమారు 90 శాతం భారతి కాలిపోయింది.

పెద్ద పెద్ద కేకలు వేయడంతో స్థానికులు చేరుకున్నారు. భారతిని సోదరి సుశీల అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించింది. స్థానికులు అధిక సంఖ్యలో రావడంతో ఆటో డ్రైవర్ ఘటన స్థలం నుండి పరారైయ్యాడు. స్థానికులు జరిగిన దారుణ ఘటన గురుంచి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందుతుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చెప్పటారు. నిందితుడు వారి బంధువుల ఇంట్లో తలదాచుకున్న విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published.