హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ?

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అయన నియోజకవర్గం హుజురాబాద్ లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ తెరాస తమ అభ్యర్థిని ప్రకటించింది. తెరాస పార్టీని వదిలి బీజేపీ లో చేరిన ఈటల రాజేందర్ హుజురాబాద్ లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా అభ్యర్థి ఎవరు అన్నది ఖరారు అవ్వలేదు. గతంలో హుజురాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా కౌశిక్ రెడ్డి ఇప్పుడు తెరాస లో చేరారు. హుజురాబాద్ నియోజకవర్గం యువతలో మంచి పట్టున్న నాయకుడు కౌశిక్ రెడ్డి. అయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉప ఎన్నికల్లో అభ్యర్థి కోసం తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.

అయితే ఇప్పటికే తెరాస,బీజేపీ పార్టీ అభ్యర్థులు ఖరారు అవ్వగా వారు బీసీ సామజిక వర్గానికి చెందినవారు కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ సామజిక వర్గానికి చెందిన వారిని అభ్యర్థిగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. తెరాస,బీజేపీ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వడానికి ప్రజాదరణ ఉన్న అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించనున్నటు సమాచారం.

తెరాస,బీజేపీ అభ్యర్థులను దీటుగా ఎదురుకోవడనికి పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ పేరు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కొండా సురేఖకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె పేరును పరిశీలిస్తున్నటుగా సమాచారం.తెరాస,బీజేపీ అభ్యర్థులను దీటుగా ఎదురుకోవడానికి ఆమె సరైన అభ్యర్థి అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తెరాస,బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా వీలైనంత తొందర్లో తమ అభ్యర్థిని ప్రకటిస్తారని తెలుస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ స్థానిక నాయకుల అభిప్రాయాలను తెలుసుకొని తుది నిర్ణయం ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published.