సోనూసూద్ నివాసంలో ఐటీ రెయిడ్స్..ఏకకాలంలో 6 చోట్ల
ఆర్.బి.ఎం ముంబై: ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ నివాసంలో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. ఉదయం నుంచి ఆయన నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 6 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు. కరోనా వేళ పేదలకు పెద్ద ఎత్తున సోనూసూద్ ఆర్థికసాయం అందించారు. ఆపన్నులకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. గతేడాది లాక్‌డౌన్ సమయంలో వలసకార్మికులను ఇళ్లకు చేర్చేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. దాంతో ఇప్పటికీ ఎంతోమంది ఆయనను ఆదర్శంగా తీసుకుని సాటివారికి సహాయం చేస్తున్నారు. ఇటీవల దేశ్ కే మెంటార్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్‌ను ఢిల్లీ సర్కార్ నియమించింది.