యువకుడి మృతదేహం లభ్యం..? రాజును ఎన్‌కౌంటర్.. సోషల్ మీడియాలో వైరల్

యువకుడి మృతదేహం లభ్యం..? రాజును ఎన్‌కౌంటర్ చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్

ఆర్.బి.ఎం : వలిగొండ-రామన్నపేట సమీపంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమయిందనే ప్రచారం జరిగింది. దీంతో సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యకేసు నిందితుడు రాజును యాదాద్రి జిల్లాలోనే ఎన్‌కౌంటర్ జరగవచ్చని సోషల్ మీడియాలో వైరల్ అయింది. మృతదేహం ఉందా లేక కావాలనే ప్రచారం చేశారా అనేది తేలాల్చి ఉంది. కావాలనే కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేశారని అనుకుంటున్నారు. మరోవైపు నిందితుడిది యాదాద్రి జిల్లా కావడంతో ఉమ్మడి జిల్లా పోలీసుల అలెర్ట్ అయ్యారు. నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో 65వ జాతీయ రహదారి వెంట పోలీసులను మోహరించారు. రాజు స్వగ్రామం యాదాద్రి జిల్లా అడ్డగూడూరు గోవిందాపురం సమీపంలో రాజుని అదుపులోకి తీసుకున్నట్టు వదంతులు వస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో రాజు దొరికాడనే ప్రచారంలో నిజం లేదని డీసీపీ నారాయణ రెడ్డి కొట్టిపారేశారు. ఇప్పటికే రాజు బంధువులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.