మద్యం సేవించి కార్లోనే నిద్ర.. పొద్దున్నే చూస్తే దారుణం!

మద్యం సేవించి కార్లోనే నిద్ర.. పొద్దున్నే చూస్తే దారుణం!

నోయిడా: మద్యం సేవించి తన కార్లోనే ఏసీ ఆన్ చేసుకొని పడుకున్న వ్యక్తి ఉదయం అందరు చూసే వరకు మృతి చెందిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నాయిడాలో శనివారం నాడు చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం మత్తులో కారులో ఏసీ ఆన్ చేసుకొని రాత్రి మొత్తం పడుకోవడం వల్లే మృతి చెందాడని దీనికి కారణం కారు ఇంజన్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వంటి విషయ వాయులు ఏసీ ద్వారా కారులోకి ప్రవేశించాయని అందువల్లే మృతి చెందాడని తెలిపారు.ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని సుందర్ పండిట్‌గా గుర్తించిన పోలీసులు. కారులో సృహలేకుండా పడి ఉన్న సుందర్ పండిట్‌ ను తమ బంధువులు సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ బాధితుడు మార్గ మధ్యలోనే మరణించాడు అని వెల్లడించిన వైద్యులు. అయితే ఈ ఘటనకు సంబందించిన ఫిర్యాదు తమకు అందలేదని వారే స్వయంగా రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Leave a Reply

Your email address will not be published.