కేసీఆర్ గారి కల సృష్టి నెరవేర్చింది..

కేసీఆర్ గారి కల సృష్టి నెరవేర్చింది..

హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారు ట్రైన్ బోగిలకు ఇంజన్ ల పనిచేశారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం ప్రత్యేక రాష్ట్ర సాధన. కొట్లాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా లాఠీలకు తూటాలకు ఎదురు నిలబడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ విరులెందరో. కేసీఆర్ గారిని నమ్మి మోసపోయాం అని రోజు ఎక్కడో ఒకచోట వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో చెప్పిన మాటలు ఇప్పుడు లేవు అని ఎంతో మంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి పెద్ద కొడుకుల ఉంటా అన్న కేసీఆర్ గారు కేవలం ఫార్మహౌస్ కె పరిమితం అయిపోయారు అని ఎన్నో గొంతులు విన్పిస్తున్నాయి. టీఆరెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఎంతో అసహనంతో ఉన్నారని తెలుస్తోంది.

ఓ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నా మాటలు ఇప్పుడు నెరవేరుతున్నట్లు కండ్లకు కట్టినట్టు కన్పిస్తున్నాయి. తెలంగాణాను బంగారు తెలంగాణ చేసి విశ్వ నగరాన్ని చేసి అమెరికాలోని డల్లాస్ కంటే అభివృద్ధి చేస్తామని హైదరాబాద్ మొత్తం ఆటోలు బస్ లు ఎలా తిరుగుతాయో అదేవిధంగా పడవలను తింపుతాం అని అణా మాటలు ఇప్పుడు నిజమైపోయాయి. భారీగా కురుస్తున్న జడి వానకు నగరంలోని ప్రధాన రోడ్లు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. కేసీఆర్ గారు అణా విధంగా నగరంలోని ప్రధాన రహదారులపై కార్లు పడవల లాగా తెలుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నాలాలను ,చెరువులను కబ్జా చేస్తున్న వారి కోరలు పికి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యతిరేకతల వల్ల వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ ప్రభుత్వానికి కొద్దిపాటి నష్టం చేకూరుతుందని విశ్లేషకుల అంచనా.

Leave a Reply

Your email address will not be published.