తెలంగాణలో లాక్ డౌన్..!

తెలంగాణలో లాక్ డౌన్..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ అలజడి సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రోజుకు వేలలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా ను కట్టడిచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాయి. అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రాష్ట్రాల్లో ఇప్పటికీ నైట్ కర్ఫ్యూ అమలు చేశారు. కాగా నైట్ కర్ఫ్యూతో కూడా పెద్దగా ఆశించినంత ఫలితం రాలేదు. తాజగా కేంద్ర ప్రభుత్వం కరోనా విజృంభణ ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ అంశం తెరపైకి తీసుకొచ్చింది. అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కాకుండా అత్యధికంగా కరోనా కేసులు నమోదౌతున్న రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు కన్నునట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఈ రోజు తెలంగాణ హోమ్ మినిస్టర్ మహా ముద్ అలీ ఆధ్వర్యంలో లక్డికాపూల్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో హోమ్ సెక్రెటరీ డీజీపీతో పాటు పలువురు కమిషనర్లు పాల్గొన్నారు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ  కేసులు అదుపులోకి రాకపోవడంతో ఈ నెల ౩౦వ తేదీ తరువాత లాక్ డౌన్ పెట్టె యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లాక్ డౌన్ పై పూర్తి నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హోమ్ శాఖకు ప్రతిపాదనలు చేరినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.