టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా

air india tata group

టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా

ఆర్.బి.ఎం ఢిల్లీ: టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా చేరింది. రేపట్నుంచి టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా బోర్డు రాజీనామా చేసింది. బోర్డు అధికారిక నామినీలు రాజీనామా చేసినట్లు సమాచారం. ఎయిర్ ఇండియాతో కలిపి విమానయాన రంగంలో మొత్తం 27% మార్కెట్ వాటాను టాటా గ్రూప్ కలిగి ఉంది. విస్తారాలో 51 %, ఎయిర్ ఆసియాలో 84% వాటాను టాటా కలిగి ఉంది. గతేడాది అక్టోబర్‌లో ఎయిర్ ఇండియా బిడ్ టాలేస్ గెలుచుకుంది. ప్రభుత్వం చేపట్టిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రూ.18 వేల కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువను టాటా గ్రూప్ కోట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published.