ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం…

సంబేపల్లె మండలం ప్రకాష్ నగర్ కాలనీ గ్రామంలో గొల్లపల్లె,ప్రకాష్ నగర్ కాలనీ,ఊటుపాలెం, నగరి, దాసరివాండ్లపల్లె, శంకరాపురం, మిన్నమరెడ్డి గారిపల్లె, గుండ్రే వాండ్లపల్లె లలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం: ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అర్హులందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలును అందించడమే తన లక్ష్యమని వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సంబేపల్లె మండలం ప్రకాష్ నగర్ కాలనీ గ్రామంలోఉదయం 6 .30 గంటలకే గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గొల్లపల్లె,ప్రకాష్ నగర్ కాలనీ, ఊటుపాలెం, నగరి, దాసరి వాండ్లపల్లె, శంకరాపురం, మిన్నమరెడ్డి గారిపల్లె, గుండ్రే వాండ్లపల్లె లలో నిర్వహించిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలోడిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి,ఎంపిపి ఆవుల నాగశ్రీ లక్ష్మీ, మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీపి బరుగు రెడ్డెన్న తదితర నాయకులు, అధికారుల బృందంతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. పల్లెల్లోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు, ప్రజా సనస్యలుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో పార్టీలు, కులాలు, మతాలకతీతంగా అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అందుతున్నా యన్నారు.

మూడేళ్ళ పాలనలో ప్రతి ఇంటికీ వేలాది, లక్షలాది రూపాయలు లబ్దిపొందడం జరిగిందన్నారు.గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థలును ఏర్పాటు చేసి పాలనను ప్రజల చెంతకు చేర్చడం జరిగిందన్నారు.అర్హత ఉండి ఇళ్ళు రానివారికి ఇళ్ళను మంజూరు చేయిస్తామన్నారు.సికే రోడ్డు నుంచి మిన్నమరెడ్డిగారిపల్లె కు రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.ప్రకాష్ నగర్ కాలనీ ఎక్ సాల్ పట్టాలపై కృషి చేస్తున్నామన్నారు.గొల్లపల్లె, ప్రకాష్ నగర్ కాలనీ లలోని ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి , పాఠశాలలో విద్యా బోధనలు మరింత మెరుగు పడాలని ఉపాధ్యాయులుకు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ప్రకాష్ నగర్ కాలనీలో డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు.గొల్లపల్లె రహదారి నిర్మాణపు పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.