ఆ పాటతో తాండూర్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు: శుభప్రద్ పటేల్, రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్

ఆ పాటతో తాండూర్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు: శుభప్రద్ పటేల్, రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్

ఆర్.బి.ఎం తాండూర్: విరాటపర్వం సినిమా నగాదారిలో పాట మహా అద్భుతమని రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. పాట రచయిత ద్యావరి నరేందర్ రెడ్డి స్వగృహం మాంబాపూర్ గ్రామానికి వెళ్లి నరేందర్ రెడ్డిని శాలువతో శుభప్రద్ పటేల్ సన్మానించి అభినందించారు. తాండూరు ప్రాంతానికి చెందిన నరేందర్ రెడ్డి ఈ పాట రచించడం గొప్ప విషయమని శుభప్రద్ పటేల్ అన్నారు . విరాటపర్వం సినిమాలో ఈ పాటతో తాండూరు ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందన్నారు. భవిష్యత్ లో మరెన్నో ఇలాంటి పాటలు రాయాలని శుభప్రద్ పటేల్ నరేందర్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, లెక్చరర్ ఫోరమ్ మహేందర్, ఉద్యమకారులు భాను, బాలు,
శ్రీకాంత్, రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.