ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాను: ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి
ఆర్.బి.ఎం: ప్రతి కార్యకర్త కు అండగా ఉంటానని, కార్యకర్త మేలు మరచిపోలేను అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. లక్కిరెడ్డిపల్లె టౌన్ కు చెందిన వార్డు మెంబెర్ ధర్భార్ షా వళ్లి ,మైనార్టీ నాయకులు ఫైరోజ్ లు గత వారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సోమవారం వారి దశ దిన ఖర్మ కాండకు (లిల్లా) హాజరై వారి యింటికి వెళ్లి కుటుంబ సభ్యులను స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుని అన్నారు. గ్రామ , వార్డ్ వాలంటైయర్ లు పని తీరు పై ఆరా తీశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెల్లేలా చూడాల్సిన బాధ్యత వాలంటైయర్ లదే నన్నారు.గ్రామాలలో నిర్మాణంలో ఉన్న హెల్త్ సెంటర్ లు, రైతు భరోసా కేంద్రాల పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చొరవ చూపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ రెడ్డెయ్య, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అమీర్, సర్పంచ్ వెంకట నారాయణ రెడ్డి, ఎంపిటిసిలు దస్తగిరి లక్ష్మీనారాయణ, గంగమ్మ ఆలయ చైర్మన్ నరసింహా రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఛాన్ భాష, మైనార్టీ నాయకులు అలిషేర్,అన్వర్,జాకీర్, సాహెబ్, బాబ్జాన్, సద్దాం, యిర్షద్ ఖజా,మహబూబ్ పీర్, గౌస్ పీర్, చోటు,అక్బర్ ,మాలిక్,అమీర్,వైఎస్సార్ సీపీ నాయకులు శంకర్ నాయుడు, సభాపతి నాయుడు, తదితరులు ఉన్నారు.