ఢిల్లీలో ప్రముఖులను కలిసిన చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి..

ఢిల్లీలో ప్రముఖులను కలిసిన చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి..

ఆర్.బి.ఎం ఢిల్లీ: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ,కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ లను చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి బి. జనార్దన్ రెడ్డి ఢిల్లీలో మర్యాదకపూర్వకంగా కలిశారు.

 

ఈ సందర్బంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేకపోతుందని అయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి భారత రాజ్యాంగాని తప్పుపట్టడం అంబదేద్కర్ ను అవమానించడమే అని జనార్దన్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీని ఎదుర్కొనే శక్తి కెసిఆర్ కు లేదని అయన స్పష్టం చేశారు. కెసిఆర్ కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.